Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

విజయ రహస్యం

మీరు ఇతరులికి సమర్పించే సత్యాలు మీకు సజీవ వాస్తవాలు అన్న నమ్మకాన్ని పుట్టించేందుకు, మా ప్రార్ధనలోను మీ ప్రసంగాల్లోను చిత్తశుద్ధి, శ్రద్ధ కనపర్చండి. యేసుకి మీరు చేసే ఏ పనినైనా చిత్తశుద్ధితో చెయ్యటానికి మీ సర్వశక్తిని ఉపయోగించటానికి ప్రయత్నించండి. పరాకాష్ఠను అందుకున్నామని కనుక ఇక పైకి వెళ్లలేమని ఎన్నడూ భావించకూడదు. ఇతరులికి ఆసక్తి పుట్టించే విధంగా సత్యాన్ని సమర్పించటానికి నిశ్చయించుకోండి. జాస్యం చెయ్యకుండా అసలు విషయానికి వచ్చి, వారి గమనాన్ని ఆకర్షించి, వారికి ప్రభువు మార్గాల పై ఉపదేశమివ్వండి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 26, 1887.  ChSTel 167.4

బైబిలుని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకి సమర్పించటం ద్వారా గొప్ప సేవ చెయ్యవచ్చు. దైవ వాక్యాన్ని ప్రతీ వ్యక్తి ఇంటికీ తీసుకువెళ్లి, అందులోని స్పష్టమైన సత్యాల్ని ప్రతీవ్యక్తి మనస్సాక్షికీ సమర్పించి, “లేఖనములను... పరిశోధించు” డి అన్న రక్షకుని ఆజ్ఞను అందరికీ పునరుచ్చరించండి. బైబిలుని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలని, దాని అవగాహనకు దేవుని వెలుగు కోసం ప్రార్ధించాలని, ఆ మీదట వెలుగు ప్రకాశించినప్పుడు, ప్రతీ ప్రశస్త కిరణాన్ని నిర్భయంగా అనుసరించి దాని పర్యవసానాల్ని భరించాలని హెచ్చరించాలి. టెస్టిమొనీస్, సం. 5, పు. 388. ChSTel 168.1