Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

అధ్యాయం 14
మతస్వేచ్ఛ

సముచిత ప్రార్థన

“జనులు నీ ధర్మ శాస్త్రమును నిరర్ధకము చేయుచున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము” అని దావీదు ప్రార్థించాడు. ప్రస్తుత కాలంలో ఈ ప్రార్థన ఔచిత్యం ఏమి తగ్గలేదు. లోకం దేవున్ని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోతుంది. దాని చట్ట రాహిత్య స్థితి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఆ మహారాజుకి నమ్మకంగా ఉన్న వారిని ఇది దిద్దుబాటు కృషికి నడిపిస్తుంది. యెహోవా సబ్బాతుకు మారుగా నకిలీ సబ్బాతును ప్రవేశపెట్టటానికి పోపుల అధికారం ప్రయత్నిస్తుంది. మత ప్రపంచమంతా అబద్ధ సబ్బాతును స్వీకరిస్తుంటే నిజమైన సబ్బాతుని అపవిత్ర పాదాలు తొక్కుతున్నాయి..... ChSTel 181.1

క్రీస్తుకి ఆయన దూతలకి సాతానుకి అతడి దూతలకి మధ్య జరిగే చివరి మహా సంఘర్షణ దైవ ధర్మశాస్త్రం పై జరుగుతుంది. అది లోకమంతటికి నిశ్చయాత్మకమయ్యింది.. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న మనుషులు సబ్బాతుని తాము ఉపేక్షించి తృణీకరించటమే గాక, మానవ కల్పితమైన తప్పుడు సబ్బాతు పక్షంగా సంప్రదాయాన్ని, ఆచారాన్ని అడ్డు పెట్టుకుని, పరిశుద్ద ప్రసంగ వేదిక పై నుంచి ఆదివారాన్ని ఆచరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. భూమి మీద సముద్రం మీద జరిగే దుర్ఘటనల్ని - గాలి తుపాన్లు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు - ప్రజలు ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించనందుకు దేవుని అసమ్మతిని సూచించే తీర్పులుగా పేర్కొంటారు. ఈ దుర్ఘటనలు ఇంకా ఎక్కువవుతాయి. ఒకదాని వెంట ఒకటి సంభవిస్తాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరు నిరర్ధకం చేస్తున్నారో వారు నాల్లో ఆజ్ఞలోని సబ్బాతును ఆచరించే ఆ కొద్దిమందిని లోకం మీదికి దేవుని ఆగ్రహాన్ని తెస్తున్న వారిగా నిందిస్తారు. అజాగ్రత్తగా ఉన్న వారిని తన ఉచ్చులో సంబంధించేందుకు ఈ తప్పుడు బోధ సాతాను పథకం. సదర్న్ వాచ్ మేన్, జూన్ 1904. ChSTel 181.2