Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

జ్ఞాపకముంచుకోవాల్సిన విషయం

మన స్నేహాలన్నింటిలో ఇతరుల అనుభవంలో నైతిక దృష్టికి మరుగుపడి ఉండాల్సిన అధ్యాయాలు కొన్ని ఉంటాయని జ్ఞాపకముంచుకోవాలి. స్మృతి పుటల్లో నుంచి తెలుసుకోవాలని ఆరాటపడే కళ్లనుంచి పరిరక్షించాల్సిన విషాద చరిత్రలుంటాయి. కష్టపరిస్థితుల్లో దీర్ఘమైన, కఠోరమైన పోరాటాలు, బహుశా ధైర్యాన్ని నమ్మకాన్ని, విశ్వాసాన్ని దినదినం బలహీన పర్చే గృహజీవన సమస్యలు అక్కడ నమోదవుతాయి. ప్రేమా పూర్వక కృషి తప్ప మరేమీ ఖర్చుకాని చిన్న శ్రద్ధ చూపటం వల్ల, కష్టపరిస్థితుల్లో జీవిత పోరాటం సాగిస్తున్నవారు శక్తిని ఉత్సాహాన్ని పొందవచ్చు. అలాంటివారికి ఓ యధార్థ మిత్రుడి బలమైన, సహాయకరమైన కరస్పర్శ, బంగారం కన్నా వెండికన్నా ఎంతో విలువ గలదవుతుంది. దయగల మాటలు దేవదూతల చిరునవ్వులా ఆదరణ కలిగిస్తాయి. ChSTel 221.1

లక్షలాది ప్రజలు పేదరికంతో సతమతమౌతున్నారు. పరిస్థితుల ఒత్తిడివల్ల చిన్న జీతానికి పనిచేస్తున్నారు. అయినా జీవిత కనీసావసరాల్ని కూడా తీర్పుకోలేకపోతున్నారు. మంచి రోజుల నిరీక్షణ లేని శ్రమ, వంచన వారి భారాన్ని మరింత చేస్తున్నాయి. వీటికి బాధ వ్యాధి తోడైనప్పుడు ఆ భారం దుర్భరమౌతుంది. విచారాలు శ్రమల కింద నలిగిపోతూ ఉపశమనానికి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ఉన్నారు. తమ కష్టాల్లోను, తమ హృదయ వేదనల్లోను, తమ ఆశాభంగాల్లోను వారికి సానుభూతి చూపించడండి. వారికి సహాయం చెయ్యటానికి ఇది మీకు మార్గం తెరుస్తుంది. దేవుని వాగ్దానాల గురించి వారితో మాట్లాడండి. వారితో కలిసి వారికోసం ప్రార్ధన చెయ్యండి. వారిలో నిరీక్షణను నింపండి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 158. ChSTel 221.2

అనేకమందికి జీవితం బాధాకరమైన పోరాటం. వారు తమ లోపాల్ని గురించి బాధపడ్డారు, దుఃఖిస్తారు, తమ నమ్మికను వదులుకుంటారు. కృతజులవ్వటానికి తమకు ఏమేలూ జరగలేదని భావిస్తారు. దయ సానుభూతిగల మాటలు, అభినందనలు వ్యక్తపర్చటం కష్టపడుతూ ఒంటరిగా ఉన్న అనేకమందికి, దప్పిగొన్న వాడికి ఓ కప్పు మంచినీళ్ళులా ఉంటాయి. దయగల మాట, దయగల క్రియ అలసిన భుజాల మీద ఉన్న బరువుని తీసివేస్తుంది. నిస్వార్థమైన దయగల ప్రతీ మాట ప్రతీ క్రియ నశించిన మానవుల పట్ల క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంది. తాట్స్ ఫ్రమ్ దిమౌంట్ ఆఫ్ బ్లెసింగ్, పు. 23. ChSTel 221.3