Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

నిపుణత

క్రమం, సూక్ష్మదృష్టి, చురుకుతనం వీటిని అలవాటు చేసుకోటం ప్రతీ క్రైస్తవుడి విధ్యుక్త ధర్మం. ఏరకమైన పనిలోనైనా మందకొడిగా అస్తవ్యస్తంగా ఉండటానికి మిషలేదు. ఒక వ్యక్తి ఎల్లప్పుడు పనిలో ఉన్నా పని ఏమి సాధించలేకపోతే దానికి కారణం అతడు తన మనసుని హృదయాన్ని ఆపనిలో పెట్టకపోటమే. ఇలాంటి లోపాలతో మందకొడిగా పనిచేస్తున్న వ్యక్తి ఇవి సరిదిద్దుకోవలసిన తప్పులని గుర్తించాలి. సత్పలితాల్ని సాధించేందుకు సమయం ఎలా వినియోగించాలో ఆలోచించటానికి అతడు తన మనసుకి పని చెప్పాలి. ఇతరులు పదిగంటల్లో చేసే పనిని నిపుణత పద్ధతి ద్వారా కొందరు అయిదు గంటల్లోనే ముగించగలుగుతారు. ఇంటి పనులు చేసుకునే కొందరు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారు. అది ఎక్కువ పని ఉండటం వల్ల కాదు. సమయం ఆదాచెయ్యటానికి వారు ప్రణాళిక తయారు చేసుకోకపోటం వల్ల, తమ మందకొడి, తీరుబడి తీరువల్ల గోరంత పనిని కొండంత చేస్తారు. మనసున్నవారందరూ ఈ ఆడంబరపు అలవాట్లను మార్చుకోవచ్చు. పనిలో వారికి నిర్దిష్టమైన గురి ఉండాలి. చేయాల్సిన ఓ పనికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకుని దాన్ని సకాలంలో ముగించటానికి శ్రమించి పని చెయ్యాలి. చిత్తశక్తి వినియోగం చేతుల్ని నిపుణతతో చలింపజేస్తుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 344. క్రీస్తు సేవ సత్వర విధేయతను డిమాండు చేస్తున్నది. సదర్న్ వాచ్ మేన్, ఆగ. 9, 1904. ChSTel 278.1

ఆత్మల విలువను త్వరగా గుర్తించే స్పూర్తి, నిర్వర్తించాల్సిన విధుల్ని త్వరగా గుర్తించే స్ఫూర్తి, తమపై ప్రభువు పెట్టే బాధ్యతకు త్వరగా స్పందించే స్పూర్తి తన సేవకుల్లో ఉండాలని ప్రభువు డిమాండు చేస్తున్నాడు. టెస్టిమొనీస్, సం. 9, పులు. 123, 124.  ChSTel 279.1

దేవుడు నియమించిన విధి నిర్వహణలో పరిశ్రమించటం యధార్థ మతంలో ప్రాముఖ్యమైన భాగం. మనుషులు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి పరిస్థితుల్ని ఆయన సాధనాలుగా చేపట్టాలి. సరి అయిన సమయంలో సత్వర, నిర్ణయాత్మక చర్య మహిమాన్విత విజయాలు సాధిస్తే, జాప్యం, నిర్లక్ష్యం పరాజయాన్ని, పరాభవాన్ని కలిగిస్తాయి. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 676. ChSTel 279.2