Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

కలత చెందవద్దు

అంకితభావం లేని పనివారి మూలంగా పరిస్థితులు తప్పుదోవ పడతాయి. దీన్ని గురించి మీకు దుఃఖం కలగవచ్చు. కాని చింతించకండి. మన రక్షకుని నిపుణమైన పర్యవేక్షణ కింద సేవ ఈ కొన నుంచి ఆ కొన వరకు సాగుతుంది. ఆయన కోరుతున్నదల్లా పనివారు తమ ఆదేశాలకు తన వద్దకు రావాలని, తన సూచనల్ని పాటించాలని. సమస్తం - మన సంఘాలు, మన సేవలు, మన సబ్బాతు బడులు, మన సంస్థలు - ఆయన మనసులో నిత్యం ఉంటుంది. కనుక మనం చింతించటం దేనికి? సంఘం దేవుడు సంకల్పించినట్లు సజీవమైన ప్రకాశవంతమైన దీపంగా వెలగటం చూడాలన్న ఆకాంక్ష దేవుని పై పరిపూర్ణ విశ్వాసం మీద ఆధారితమవ్వాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 14, 1893.  ChSTel 285.2

ప్రశాంతతను అలవర్చుకుని మి ఆత్మల్ని సృష్టికర్త అయిన దేవుని చేతులకి అప్పగించండి. ఆయన తనకు అప్పగించిన సమస్తాన్ని జాగ్రత్తగా కాపాడతాడు. మనం తన బలిపీఠాన్ని కన్నీటితో తడపటం, ఫిర్యాదులతో నింపటం ఆయనకు ఇష్టం లేదు. ఇంకొక ఆత్మను ఆయన వద్దకు తే లేకపోతే ఆయన్ని స్తుతించటానికి ఇప్పటికే మీకు చాలా విషయాలున్నాయి. కాని ప్రతీ విషయాన్నీ మీ అభిప్రాయాలకి అనుగుణంగా మార్చటానికి ప్రయత్నించకుండా ఉంటే, మంచి పని కొనసాగుతూనే ఉంటుంది. దేవుని సమాధానం మీ హృదయాల్లో రాజ్యమేలనివ్వండి. అంతట ఆయనకు కృతజులై ఉండండి. దేవుడు పని చెయ్యటానికి చోటు పెట్టండి. ఆయనకు అడ్డు తగలకండి. చెయ్యనిస్తే మాకు ఆయన ఎంతో మేలు చెయ్యగలడు, చేస్తాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 136. ChSTel 285.3