Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

ఆజ్ఞల ఆచరణ పాపానికి ఓ ముసుగు

దైవ ధర్మశాస్త్ర పరిరక్షకులుగా చెప్పుకునే ప్రజలనడుమ నేడు అదే ప్రమాదం ఉంది. ఆజ్ఞల పట్ల తాము కనపర్చే గౌరవం తమను దైవన్యాయం వక్తినుంచి కాపాడుందని భావించి తృప్తి చెందే ప్రమాదముంది. వారు పాపం నిమిత్తం మందలింపును తిరస్కరించి శిబిరంలోనుంచి పాపాన్ని తీసివేయటంలో మితిమీరిన ఉత్సాహం కనపర్చుతున్నారని దైవసేవకుల్ని నిందిస్తారు. తన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లు చెప్పుకునే వారిని సమస్త దుర్నీతిని విడిచి పెట్టాల్సిందిగా పాపాన్ని ద్వేషించే దేవుడు పిలుస్తున్నాడు. పూర్వం ఇశ్రాయేలు మీదికి ఇదేపాపం తెచ్చిన తీవ్ర పర్యవసానాల్నే, పశ్చాత్తాపపడటంలో, వాక్యానికి విధేయంగా నివసించటంలో నిర్లక్ష్యం నేడు దైవప్రజల మీదికి అవే తీవ్ర పర్వవనాల్ని తెస్తుంది. ఒక హద్దు ఉన్నది. దాని తర్వాత ఆయన తన తీర్పుల్ని ఇక ఎంతమాత్రం ఆలస్యం చెయ్యడు. టెస్టిమొనీస్, సం.4, పులు. 166,167.  ChSTel 45.1