Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

అధ్యాయం-6
శిక్షణ కాలంలో విద్యార్థులు మిషనెరీ సేవ చెయ్యటం

విద్య లక్ష్యం

నిజమైన విద్య మిషనెరీ సేవాశిక్షణే. దేవుని ప్రతీ కుమారుడు ప్రతీ కుమార్తె మిషనెరీ సేవకు పిలుపు పొందుతున్నారు. మనం దేవుని సేవకు తోటి మానవుల సేవకు పిలుపు పొందుతున్నాం. ఈ సేవకు మనల్ని యోగ్యుల్ని చెయ్యటమే మన విద్య లక్ష్యం కావాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 395. ChSTel 71.1

సాతాను శోధనలకు వ్యతిరేకంగా యువతను బలపర్చటానికి పాఠశాలలు స్థాపిస్తున్నాం. వారు ఈ జీవితంలో ఉపయోగకరమైన సేవకు నిత్యజీవ యుగాల పొడుగున దేవుని సేవకు ఈ పాఠశాలల్లో శిక్షణ పొందవచ్చు. కౌన్ సిల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 495. జ్ఞానంలేనివారి కోసం, నశించిపోతున్నవారికోసం పనిచెయ్యాలన్న కోరికతో జ్ఞానం సంపాదించాలని కృషి చేసే వ్యక్తి మానవుల విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో తన పాత్రను పోషిస్తున్నాడు. ఇతరులకు మేలు చేసేందుకు స్వార్ధరహితంగా సేవ చెయ్యటంలో క్రైస్తవ విద్యతాలూకు ఉన్నత ప్రమాణాల్ని అతడు సాధిస్తున్నాడు. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 545. ChSTel 71.2

తోసుకుంటూ ముందుకువచ్చి, పాఠశాలలో కొద్ది సమయం గడిపి, ఆమిదట లోకానికి దేవుని వర్తమానం అందించటానికి సిద్ధపడి, సేవకు ముందంజవేసే బలమైన, భక్తిపరులైన, ఆత్మత్యాగస్పూర్తిగల యువతీ యువకుల్ని దేవుడు పిలుస్తున్నాడు. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 549.  ChSTel 71.3