Loading…
ముందుమాట
ఆహారానికి ఆరోగ్యానికి గల సన్నిహిత సంబంధం గురించి శరీర ధర్మశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చెయ్యటానికి ఎన్నో దశాబ్దాల ముందే, తనకు 1863లో దేవుడు బయలు పర్చిన అభిప్రాయాల్ని గురించి రాస్తూ, మనం తినే ఆహారానికి మన శారీరక, ఆధ్యాత్మిక సంక్షేమానికి మధ్యగల సంబంధాన్ని శ్రీమతి ఎలెన్ జి. వైట్ వివరంగా సూచించారు. తర్వాతి సంవత్సరాల్లో, తన ప్రసంగాల్లో, రచనల్లో ఆహారాంశాన్ని ఆమె తరచు ప్రస్తావించేవారు. సంఘ పత్రికలు, పుస్తకాలు, పత్రికల్లోని వ్యాసాల్లోను, వ్యక్తిగత సాక్ష్యాల్లోను భధ్రపర్చబడ్డ ఈ సూచనలు సెవెంతుడె ఎడ్వంటిస్టు విశ్వాసుల ఆహార అలవాట్ల పై గొప్ప ప్రభావం చూపించటమే కాక సామాన్య ప్రజా జీవనాన్ని కూడా కొంతమేరకు ప్రభావితం చేస్తున్నాయి. CDTel .0
ఈ సూచనలు సలహాల్లో కొంతమట్టుకు మాత్రమే పాఠకుడికీ పరిశోధకుడికీ సాకల్యంగా లభించటం జరిగింది కాబట్టి, ఈ సూచనల్లో అనేకమైన వాటిని, వాటితోపాటు ఇ.జి.వైట్ (ప్రస్తుత గ్రంథాల్లోని సూచనల్ని చేర్చి 1926లో టెస్టిమొనీ స్టడీస్ ఆన్ డయట్ అండ్ పూడ్పు (ఆహారం ఆహార పదార్థాల పై సాక్ష్య అధ్యయనాలు) అన్న పేరుతో ఓ సంకలనం ప్రచురించటం జరిగింది. ఆహార పదార్థాలు, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని గురించిన ఈ ప్రవచన సార సూచనలు సలహాలు, ప్రాథమికంగా కాలిఫోర్నియాలోని లో మలిండ వైద్య విద్యాలయంలో ఆహార విద్య, వైద్యవిద్య అభ్యసించే విద్యార్థుల పాఠ్యపుస్తకంగా సంకలనం చేయబడింది. విద్యార్థుల నుంచేగాక సామాన్య సెవెంతుడే ఎడ్వంటిస్టు విశ్వాసులనుంచి కూడా గిరాకీ పెరగటంతో కొద్ది కాలంలోనే మొదటి ముద్రణ ప్రతులు అయిపోయాయి. CDTel .0
ఈ పుస్తక భోధనల పట్ల ఏర్పడ్డ ఆదరణ వల్ల 1938లో మరింత పెద్దదైన నూతన ముద్రణ అవసరమయ్యింది. ఇది సామాన్య ప్రజా పంపిణీకి ఉద్దేశించింది. ఆహారం ఆహార పదార్థాలపై సూచనలు తాలూకు రాత ప్రతి బోర్డ్ ఆఫ్ ఎలైన్ జి. వైట్ ట్రస్టీస్ ఆధ్వర్యంలో వారి CDTel .0
కార్యాలయంలో సంకలనం చేయటం జరిగింది. ఇ.జి. వైట్ రచించిన, ప్రచురమైన, ప్రచురంకాని రచనలు ఇక్కడ లభ్యం కాగలవు. ఈ ప్రచురణకు ఎంత మంచి ఆదరణ లభించిందంటే కేవలం ఎనిమిదేళ్ళ స్వల్ప వ్యవధిలోనే నాలుగు ముద్రణలు అవసరమయ్యాయి. ఇది మూడో ముద్రణలోని పుస్తకం. 1946లో అచ్చుమార్చటం జరిగినా విషయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. ఎక్కువ అనుకూలమైన ఈ పరిమాణంలోను రూపంలోను దీనికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ CDTel .0
ఆహారం ఆహార పదార్థాల అంశం పై శ్రీమతి వైట్ కలం నుంచి జాలువారిన ఉపదేశమంతటినీ ఈ పుస్తకంలో పొందుపర్చటానికి ప్రయత్నం జరిగింది. స్థలాభావం వల్ల, సూచనల పునరావృతం జరగకూడదన్న ఉద్దేశం వల్ల, ఈ అంశం పై ఉన్న ప్రతి విషయాన్ని సంపూర్తిగా సమగ్రంగా సమర్పించటం సాధ్యపడలేదు. CDTel .0
ఈ సంకలనంలోని ప్రతీ విభాగం చర్చ జరుగుతున్న అంశం పై ఓ చిన్న పుస్తకమే. ఆరోగ్య ఉపదేశంలోని అనేక దశల్ని తరచు ఒక పేరాలోనే ప్రస్తావించటం జరుగుతుంది. సందర్భాన్ని ప్రస్తావించటంలో ఇలా ప్రత్యక్ష పునరావృతం, కొద్దీగొప్పో, భావపునరావృతం కూడా జరుగుతుంటుంది. ఇలా విషయాను సంధానం పరిశీలనల ద్వారా పునరావృత్తిని చాలా మట్టుకు నివారించటం జరిగింది. CDTel .0
ఈ పుస్తకంలోని ప్రతీ వర్తమాన భాగం - అది ఎలెన్ జి.వైట్ తొలినాటి పుస్తకాలు, చిన్నపుస్తకాలు, ప్రధాన వ్యాసాలేగాని లేక ఆమె రాతప్రతుల నుంచి ఎంపిక చేసిన భాగాలేగాని - అది ఎక్కడనుంచి ఎంపిక చేయబడిందో, ఎప్పుడు రాయబడిందో లేక ఎప్పుడు ప్రచురించబడిందో ఆ వివరాలు కలిగి వుంటుంది. CDTel .0
ఈ పుస్తకాన్ని పొందుపర్చుతున్న వర్తమాన భాగాల్లో అనేకమైనవి ఆహార విషయాల్లో సాధారణ అజ్ఞానం ప్రబలి, సంస్కరణకు విముఖత ఉన్న కాలంలో రాయబడ్డవి. దేవుడు బయలు పర్చిన సత్యసూత్రాలు శాస్త్ర అధ్యయన పురోగమనం ద్వారా పూర్తి ధృవీకరణ పొందటం, వాటి చిన్న చిన్న వివరాలు సయితం కాలగమనంలో సెవెంతుడె ఎడ్వంటిస్టు సంఘానికి దేవుని వద్ద నుంచి వచ్చిన సత్యాన్ని దృఢపర్చటం ముదావహం. CDTel .0
ఉపదేశం అంతటిని ఓ విస్తృతమైన, స్థిరమైన, సమతుల్యమైన మొత్తంగా నిష్కపట మనసుతో అధ్యయన చెయ్యాలి. ఇలా చేస్తే, సందర్భంతో పొంతన లేకుండా, ఒకే వర్తమాన భాగం పై ఆనుకుని ఏర్పర్చుకున్న తీవ్ర భావాల స్వీకరణను నివారించవచ్చు. CDTel .0
ఈ పుస్తకం అందిస్తున్న సూచనలు సలహాలు మరింత సమగ్ర జ్ఞానాభి వృద్ధికి తోడ్పడి, మనకు అప్పగించబడ్డ మహత్తర ఆరోగ్య వర్తమానం పట్ల మరింత ఆదరాభిమానాల్ని పెంచాలన్నది మా ఆకాంక్ష. CDTel .0
ఎలెన్ జి. వైట్ ప్రచురణల ధర్మకర్తలు