Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

విభాగం X—ఉపవాసం

ఆహారం వాంఛ ఉపేక్ష ద్వారా క్రీస్తు విజయం

(1998) D.A.117,118  CDTel 188.1

295. ఏదెనులోని పరిశుద్ధ జంట విషయంలోలాగే క్రీస్తు విషయం లోనూ ఆహారవాంఛ మొదటి గొప్ప శోధనకు ప్రాతిపదిక. పతనం ఎక్కడ ప్రారంభమయ్యిందో అక్కడ విమోచన ప్రారంభమవ్వాలి. ఆహారవాంఛ మూలంగా ఆదాము పడిపోయినట్లే ఆహారవాంఛను ఉపేక్షించటం ద్వారా క్రీస్తు జయించాల్సి ఉన్నాడు. “నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి- నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన-మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించునని వ్రాయబడియున్నదనెను.” CDTel 188.2

ఆదాము కాలంనుంచి క్రీస్తు కాలం వరకు స్వీయ ఆనందం, ఆహారవాంఛ, శరీరేచ్చల శక్తిని నియంత్రించలేనంతగా వృద్ధిపర్చాయి. ఈ విధంగా మనుషులు నైతికంగా దిగజారి వ్యాధికి లోనయ్యారు. దాన్ని తమంతట తాము అధిగమించటం అసాధ్యం. కఠినాతి కఠినమైన పరీక్షను తట్టుకోటం ద్వారా మానవుడి తరపున క్రీస్తు జయించాడు. మననిమిత్తం ఆకలికన్నా మరణం కన్నా బలమైన ఆత్మనిగ్రహాన్ని ఆయన పాటించాడు. చీకటి శక్తులతో మన పోరాటంలో ప్రవేశించే ఇతర సమస్యలు ఈ మొదటి విజయంలో ఉన్నాయి. CDTel 188.3

క్రీస్తు అరణ్యంలో ప్రవేశించినప్పుడు, తండ్రి మహిమ ఆయన్ని ఆవరించింది. దేవునితో సహవాసంలో లీనమై మానవ బలహీనతను అధిగమించి ఆయన ఔన్నత్యం పొందాడు. కాని మహిమ వెళ్లిపోయింది. శోధనతో పోరాడటానికి ఆయన మిగిలిపోయాడు. ప్రతీ క్షణం శోధన ఆయన పై దాడి చేస్తున్నది. తనకోసం వేచి వున్న సంఘర్షణకు ఆయన మానవ స్వభావం వెనకాడింది. ఆయన నలభై రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ఆకలివల్ల బలహీనుడై, అలసిపోయి, మానసికంగా వేదన చెందిన ఆయన “మనిషి రూపముకంటె అతని ముఖమును, నరుని రూపము కంటె అతని రూపమును చాల వికారము”గా ఉన్నాయి. ఇప్పుడు సాతానుకి అవకాశం వచ్చింది. క్రీస్తును జయించగలననుకున్నాడు. CDTel 188.4

ఉత్తరం 158, 1909  CDTel 189.1

296. క్రీస్తు ఆహార వాంఛపై పరీక్ష ఎదుర్కొన్నాడు. మానవుడి తరపున దాదాపు ఆరు వారాలు శోధనను ప్రతిఘటించాడు. అరణ్యంలోని ఆ సుదీర్ఘ ఉపవాసంలో పతిత మానవుడు నిరంతరం నేర్చుకోవలసిన పాఠం ఒకటుంది. అపవాది శక్తిమంతమైన శోధనలకు క్రీస్తు లొంగలేదు. శోధనతో పోరాడుతున్న ప్రతీ ఆత్మకు ఇది గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. భక్తిగా జీవించాలని ఆకాంక్షించే వారందరు గొర్రెపిల్ల రక్తంద్వారా, తమ సాక్ష్యం ద్వారా క్రీస్తు జయించినట్లు జయించగలుగుతారు. రక్షకుని ఆ సుదీర్ఘ ఉపవాసం సహించటానికి ఆయనను బలపర్చింది. పతనం ఎక్కడ ప్రారంభమయ్యిందో అక్కడ ఆహారం విషయంలో జయించే పనిని ప్రారంభిస్తానని ఆయన మానవుడికి నిదర్శనాన్నిచ్చాడు. CDTel 189.2

(1869) 2T 202,203  CDTel 189.3

297. క్రీస్తు ప్రచండ శోధన దాడికి గురి అయినప్పుడు ఉపవాసమున్నాడు. తనను దేవునికి అప్పగించుకుని, పరలోకమందున్న తనతండ్రి చిత్రానికి సంపూర్తిగా విధేయుడవ్వటం ద్వారా విజయుడయ్యాడు. క్రైస్తవులమని చెప్పుకునే ఏ ఇతర తరగతి ప్రజల కన్నా, ఈ చివరి దినాలకి దేవుడిచ్చిన సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పుకునే ప్రజలు ప్రార్థనలో ఆ గొప్ప ఆరర్శనీయుణ్ని ఎక్కువగా అనుకరించాలి. సందర్భానికి 70 చూడండి) CDTel 189.4

(1875) 3T 486  CDTel 189.5

298. అతి తిండి శరీరాన్ని బలహీనపర్చి, నిత్యజీవానికి సంబంధించిన విషయాల్ని జ్ఞానేంద్రియాలు గ్రహించ లేనంతగా వాటిని మొద్దుబార్చుతుంది. లోకం తిండిబోతుతనానికి బానిస అయ్యిందని అతి తిండి నైతిక శక్తుల్ని భ్రష్టపర్చుతుందని క్రీస్తుకు తెలుసు. మానవుల పై అతితిండి పట్టు అంత పటుతరంగా ఉండటంవల్ల దాని శక్తిని నాశనం చెయ్యటానికి దైవ కుమారుడు దాదాపు ఆరు వారాలు మానవుడి తరపున ఉపవాసముండటం అవసరమైతే, క్రీస్తు జయించినట్లు జయించటమన్న కర్తవ్య సాధనకు క్రైస్తవుడి ముందు ఎంత గొప్ప సవాలున్నది! అరణ్యంలోని ఆ సుదీర్ఘ శోధనలో క్రీస్తు అనుభవించిన తీవ్ర వేదన మాత్రమే వక్ర తిండికి కలిగే శోధనకున్న శక్తిని కొలవగలుగుతుంది. CDTel 189.6