Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

విభాగం XVII—ఆహారం మంచి మందు

ప్రకృతి నివారణ సాధనాలు

MS 86, 1897  CDTel 312.1

450. జబ్బు చేసినప్పుడు పథ్యం చెయ్యటంలోని ఉపకారం గురించి తెలుసుకోటం ప్రాముఖ్యం. తమకు తాము ఏ చేసుకోవాలో అందరూ అవగతం చేసుకోవాలి. CDTel 312.2

(1885) 5T 443  CDTel 312.3

451. స్వస్తత కళని ఉపయోగించే మార్గాలు చాలా ఉన్నాయి. కాని దేవునికి అంగీకారమయ్యింది ఒకటే. దేవుని నివారణ సాధనాలు సామాన్య ప్రకృతి వనరులు. అవి తమ శక్తిమంతమైన లక్షణాల ద్వారా శరీర వ్యవస్థ పై భారం మోపటంగాని దాన్ని బలహీనపర్చటంగాని చెయ్యవు. శుద్ధమైన గాలి, నీరు, పారిశుధ్యం, సరియైన ఆహారం, పవిత్రజీవనం, దేవునిపై బలమైన నమ్మకం నివారణ సాధనాలు. ఇవి లేనందువల్ల వేల ప్రజలు మరణిస్తున్నారు. అయినా ఈ నివారణ వనరులు పాతబడి మరుగైపోతున్నాయి. ఎందుకంటే వాటిని నిపుణతతో ఉపయోగించటానికి ప్రజలు అభినందించని శ్రమ అవసరం. శుభ్రమైన గాలి, స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన ఇల్లు ఖర్చేమీ లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నవే. కాని మందులు డబ్బు విషయంలోను శరీర వ్యవస్థపై వాటి ప్రభావం విషయంలోను ఖరీదైనవి. CDTel 312.4

(1905) M. H.227  CDTel 312.5

452. శుద్ధమైన గాలి, సూర్యరశ్మి, మితానుభవం, విశ్రాంతి, వ్యాయామం, సరియైన ఆహారం, నీరుతాగటం, దైవశక్తి పై నమ్మకం- ఇవి నిజమైన నివారణ వనరులు. ప్రకృతిలో ఉన్న నివారణ సాధనాల్ని గూర్చి -టిని ఉపయోగించే పద్ధతిని గూర్చిన జ్ఞానం ప్రతీ వ్యక్తి సంపాదించాలి. వ్యాధి బాధితులకి చికిత్సచేసే నియమాల్ని అవగాహన చేసుకోటానికి, ఈ జ్ఞానాన్ని యుక్తంగా వినియోగించటానికి సామర్ధ్యాన్నిచ్చే ప్రయోగాత్మక శిక్షణ పొందటానికి అది అగత్యం . CDTel 312.6

స్వాభావిక నివారణ సాధనాల వినియోగానికి అవసరమయ్యే సంరక్షణని శ్రమను ఇవ్వటానికి అనేకులు సమ్మతించరు. ప్రకృతి స్వస్తత, నిర్మాణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. సహనం లేని వారికి మందకొడి గమనంలా కనిపిస్తుంది. హానికరమైన తిండి వాంఛను విడిచి పెట్టటానికి త్యాగం అవసరమౌతుంది. కాని ఆటంకపర్చకుండా ఉంటే ప్రకృతి తుదకు తన పనిని చక్కగా చేస్తుందని నిరూపితమౌతుంది. ప్రకృతి చట్టాల్ని సహనంతో ఆచరించేవారు ప్రతిఫలంగా శారీరకంగాను మానసికంగాను మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. CDTel 313.1

(1890) C.T.B.H.160  CDTel 313.2

453. శక్తిహీనులైన రోగులు ఆరోగ్యపునరుద్ధరణకు విదేశాలు సందర్శించాలని, ఏదో ఖనిజ ఊట వద్దకు వెళ్లాలని లేదా సముద్ర ప్రయాణం చెయ్యాలని వైద్యులు సలహా ఇస్తారు. అయితే వీరిలో పదింట తొమ్మిది మంది మితంగా తిని, ఉల్లాస హృదయంతో ఆరోగ్యదాయకమైన వ్యాయామం చేస్తే వారు తమ ఆరోగ్యాన్ని పునరుద్దరించుకుని తమ సమయాన్ని ద్రవ్యాన్ని వృధాపుచ్చకుండా ఉండవచ్చు. అనేకుల విషయంలో బలహీనులైన రోగులకి వ్యాయామం, అందరికీ దేవుడిచ్చే దీవెనలైన గాలి సూర్యరశ్మి సమృద్ధి వినియోగం జీవితాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. CDTel 313.3