Loading…
విభాగం XX—మసాలాలు, వగైరా పదార్థాలు
భాగం I - మసాలాలు, భోజనసంభారాలు
ఉత్తరం 142, 1900 CDTel 350.1
555. లోకస్తులు తరచుగా ఉపయోగించే భోజన సంభారాలు జీర్ణక్రియకు విఘాతం కలిగిస్తాయి. CDTel 350.2
(1905) M. H.325 CDTel 350.3
556. ఉత్తేజకాలు, మత్తు పదార్థాలు అన్న అంశం కింద ఆహారంగానో పానీయంగానో ఉపయుక్తమయ్యే అనేక రకాల పదార్థాలు కడుపులో మంట పుట్టించి, రక్తాన్ని విషకలితం చేసి నరాల్ని ఉత్తేజపర్చుతాయి. వాటిని ఉపయోగించటం చాలా కీడు చేస్తుంది. ప్రస్తుత ఫలితాలు ఉల్లాసాన్నిస్తాయి గనుక మనుషులు ఉత్తేజకాలిచ్చే ఉత్సాహాన్ని ఆకాంక్షిస్తారు. కాని అది ఎల్లప్పుడు ప్రతి క్రియకు దారి తీస్తుంది. శారీరక దుర్బలతని, క్షీణతని కలిగించటంలో అది చురుకైన పాత్ర పోషిస్తుంది. CDTel 350.4
వేగం ప్రధానమైన ఈ యుగంలో ఎంత తక్కువ ఉద్రేకం పుట్టించే ఆహారం తీసుకుంటే అంత మంచిది. స్వాభావికంగా హానికరమైన ఆవాలు, మిరియాలు, మసాలాలు, పచ్చళ్లు, ఇంకా ఇలాంటి ఇతర పదార్థాలు కడుపులో మంట పుట్టించి, రక్తాన్ని వేడెక్కించి, చెడు రక్తంగా మార్చుతాయి. తాగుబోతు కడుపు తాలూకు ఉద్రిక్త పరిస్థితే మంట పుట్టించే మసాలాల వినియోగం వల్ల ఉత్పన్నమౌతుంది. కొద్దికాలంలోనే సాదాసీదా ఆహారం ఆకలి తీర్చలేకపోటం జరుగుతుంది. ఏదో కొరవడి నట్టు, మరింత ఉద్రేకాన్నిచ్చేదేదో కావాలన్నట్లు వ్యవస్థ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. CDTel 350.5
(1896) E.from U.T.6 CDTel 350.6
557. ఆహార సంభారాలు టీ, కాఫీ, సారా శ్రమజీవికి తన పని వెయ్యటంలో ఎంత సహాయం చేస్తాయో భోజన బల్లపై పెట్టటానికి తయారు చేసే ఆహారంలో వాడే మసాలాలు అంతే సహాయం చేస్తాయి. ఉద్రేకం పుట్టించే ఈ పదార్థాల వల్ల వారు ఎంత ఉన్నతంగా లేస్తారో సత్వర ఫలితాలు పోయిన తర్వాత అంత తక్కువ స్థితికి దిగిపోతారు. వ్యవస్థ బలహీనమౌతుంది. రక్తం చెడిపోతుంది. దాని ఫలితం మంట. CDTel 350.7