Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

1903 లో వెలుగును అనుసరించటం

ఉత్తరం 45, 1903  CDTel 514.6

20. మా కుటుంబంలో మేము నాణే ఉదయం ఏడున్నర గంటలకి మధ్యాహ్నం భోజనం ఒకటిన్నర గంటలకి తీసుకుంటాం. రాత్రి భోజనం తీసుకోం. మా కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మందికి ఇవి మిక్కిలి అనుకూల సమయాలు. లేకపోతే మా భోజన సమయాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకునే వాళ్లం . CDTel 514.7

నేను రోజుకి రెండుపూటలు మాత్రమే భోజనం చేస్తాను. ముప్పయి ఏళ్ల క్రితం నాకు వచ్చిన వెలుగుని నేనింకా అనుసరిస్తున్నాను. మాంసం తినను. స్వచ్ఛమైన ఆహార వస్తువులు లభ్యం కాని చోట్ల ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించవచ్చు. మాకు రెండు పాడి ఆవులున్నాయి. ఒకటి జెర్సీ ఆవు ఇంకోటి హోల్ స్టీన్ ఆవు. మేము వెన్న వాడతాం . మా కుటుంబ సభ్యులందరూ దీనితో తృప్తి చెందుతారు. CDTel 514.8

ఉత్తరం 62, 1903  CDTel 515.1

21. నా వయసు డెబ్బయి అయిదు సంవత్సరాలు. నేను ఇంతకు ముందు చేసినంత రాతపని ఇప్పుడు చేస్తున్నాను. నా జీర్ణశక్తి చక్కగా ఉంది. నా మెదడు తేటగా ఉంది. CDTel 515.2

మేము తినే ఆహారం సామాన్యమైంది, ఆరోగ్యదాయకమైంది. మా భోజనబల్ల మీద బటర్, మాంసం, చీజ్, నూనెతో వండిన ఆహార పదార్థాల మిశ్రమాలు ఉండవు. క్రీస్తును విశ్వసించని ఓ యువకుడు కొన్ని మాసాలుగా మాతో భోజనం చేశాడు. అతడు తన జీవితమంతా మాంసం తింటూ వచ్చినవాడు. అతడి నిమిత్తం మా ఆహారంలో మార్పులేమీ చెయ్యలేదు. అతడు మాతో ఉన్న కాలంలో సుమారు ఇరవై పౌన్ల బరువు పెరిగాడు. అతడు తినటానికి అలవాటుపడ్డ ఆహారం కన్నా మేము ఇచ్చిన ఆహారం ఎంతో శ్రేష్ఠమైంది. మాతో భోజనం చేసేవారందరూ మేము సమకూర్చే ఆహారం చాలా తృప్తికరంగా ఉన్నదని వ్యక్తం చేస్తారు. CDTel 515.3