Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

కుటుంబాన్ని కఠిన నిబంధనలు బంధించలేదు

ఉత్తరం 127, 1904  CDTel 515.4

22. నేను మిక్కిలి సామాన్యంగా తయారు చేసిన మిక్కిలి సామాన్యమైన ఆహారం భుజిస్తాను. కొన్ని మాసాలుగా సేమియాని టమాటోలతో కలిపి ఉడకబెట్టి, సంపూర్ణ గోధుమ బ్రెడ్ లో తిన్నాను. నా ప్రధానాహారం అదే. అప్పుడు పండ్లతో చేసిన స్ట్యూ, కొన్నిసార్లు లెమన్పయి తీసుకుంటాను. ఎండబెట్టిన కార్న్ ని పాలతోగాని మీగడతోగాని ఉడికించి తింటాను. కొన్నిసార్లు అది నేను తినే మరో వంటకం. CDTel 515.5

నా కుటుంబ సభ్యులు నేను తినే వాటినే తినరు. నన్ను నేను ప్రామాణికంగా నియమించుకోను. ప్రతీ వ్యక్తి తనకు ఏది ఉత్తమమో దాన్ని అనుసరించటానికి వారిని విడిచి పెడతాను. నా మనస్సాక్షికి అనుగుణంగా ఉండేటట్లు ఎవరి మనస్సాక్షినీ కట్టిపడెయ్యను. ఆహారం విషయంలో ఒకరు ఇంకొకరికి ప్రామాణికం కాలేరు. అందరూ అనుసరించేందుకు ఓ నిబంధన రూపొందించటం అసాధ్యం. నా కుటుంబంలో కొందరికి చిక్కుడు కాయంటే మహా ఇష్టం. నాకు అదంటే విషంలా ఉంటుంది. నా భోజనబల్లమీద బటర్ ఉండదు. కాని నా కుటుంబ సభ్యులెవరైనా కొంచెం బటర్ ఉపయోగించాలనుకుంటే, నా భోజన బల్లకు దూరంగా వెళ్లి ఉపయోగించవచ్చు. మాకు భోజనం రెండు పూటలే వడ్డన జరుగుతుంది. అయితే సాయంత్రం ఏదైనా కొంచెం తినాలనుకునే వారెవరైనా ఉంటే తినకూడదన్న నిషేధం ఎవరి పైనా లేదు. మా భోజనం గురించి ఎవరూ ఫిర్యాదు చెయ్యరు. ఎవరూ అసంతృప్తితో వెళ్లరు. సామాన్యమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం సరఫరా చెయ్యటం ఎప్పుడూ జరుగుతుంది. CDTel 515.6