Loading…
18—మానసిక స్వస్థత
మనసుకు శరీరానికి చాల దగ్గర సంబంధం ఉన్నది. ఒక దానికి హాని కలిగితే రెండోది సహవేదన పడుతుంది. అనేకులు గుర్తించే దానికన్నా మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితిని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనుషులు బాధపడే వ్యాధుల్లో ఎక్కువ మానసిక విచారం ఫలితం, దు:ఖం ఆందోళన, భేదం, అపరాధం, సంశయం అన్నీ జీవశక్తుల్ని విచ్చిన్నం చేసి క్షీణతను మరణాన్ని ఆహ్వానించటానికి దారి తీస్తుంది. MHTel 202.1
ఊహా కొన్నిసార్లు వ్యాధిని పుట్టించి దాన్ని తరుచు అధికం చేస్తుంది. తాము బాగానే ఉన్నాం. అని తలంచితే బాగా ఉండే అనేకులు జీవితమంతా మంచాన పడి ఉంటారు. కాసేపు రక్షణ లేకపోవటం వ్యాధి కలిగిస్తుందని అనేకులు ఊహిస్తారు. అది ఎదురు చూస్తున్న పరిణామం గనుక ఆ దుష్పరిణామం చోటుచేసుకుంటుంది. తాము జబ్బుగా ఉన్నామని పూర్తిగా ఊహిం చుకుని తెచ్చుకున్న వ్యాధితో అనేకులు మరణించటం జరగుతున్నది. MHTel 202.2
ధైర్యం, నీరీక్షణ విశ్వాసం, సానుభూతి, ప్రేమ ఆరోగ్యాన్ని వృద్ధిపర్చి జీవితాన్ని పొడిగిస్తాయి. తృప్తిగా ఉన్న మనసు, ఉల్లాసంగా ఉన్న స్వభావం శరీరానికి ఆరోగ్యాన్ని ఆత్మకు శక్తిని సమకూర్చుతాయి. “సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండి పోజేయును”. సామతెలు 17:22 MHTel 202.3
రోగులకు చికిత్స చెయ్యటంలో మానసిక ప్రభావ ఫలితాల్ని విస్మరించకూడదు. సరిగా వినియోగించుకుంటే ఈ ప్రభావం వ్యాధిని ప్రే ” తిఘటించటంలో మిక్కిలి ఫలవంతమైన సాధనాల్లో ఒకటి అవుతుంది. MHTel 202.4